Wednesday, May 30, 2012

నీ ధ్యాసలో

    కాలమనే గాలంలో చిక్కిన మనసుకు ఇలలో ప్రేమే కదా జీవన వేదం.
    ప్రేమించిన మనసు చేసే సేద్యానికి తానాశించే మనసే వైద్యం.
    ఇరువురి యెదలో కలిగే స్పందనలే నైవేద్యం.
    మరువపు పరిమళాల తలపులలో నీ ఎడబాటు మరణమననా?
    లేక ....ఇది ప్రణయ తాపమని సరిపెట్టుకోనా ....?
    ఎన్నడు ఎరుగని ఈ కలవరం తొలి వరం అననా ...
    లేక....ఈ పరువమే తన వరం అని ఉప్పొంగిపోనా ...
    నన్ను వివసురాలిగా చేసిన నీ మనసుని పరుషంగా నిందించాలన్నా 
    నీ ధ్యాసలో లీనమైన నా మనసు ఆ పరవశాన్ని వీడనంటుంది ...

Tuesday, May 29, 2012

నీకై నేను

నేను నువ్వుగా మారిన క్షణాన,
నా కన్నె పరువం నీ కన్నుల కొంటె అల్లరికి బానిసైతే,
సిగ్గు చాటున నా కళ్ళు అరమోడ్పులై ,
మనకై ఎదురు చూసే వెన్నెల రాత్రులలో ,
వన్నెల అలలను నాలో దాచుకుని నీకై నిరీక్షించనా ప్రియా!